WRITER OF SATHYAANVESHANA

SRI SIDDANI MOGILISWAR F/O S. TIRUNAYANA KUMAR, THE BLOGGER WROTE THIS SATHYAANVESHANA IN 2006 AT THE AGE OF 83. IF ANY READER WANTS TO TALK WITH HIM, VISIT HIM AT BLOGGERS HOUSE

ప్రధమ పుష్పం - అస్తి

తత్త్వం
 ప్రధమ పుష్పం - అస్తి
ఆదేశం :  సత్ అన్వేషణ రహస్యాలు  
మొదటిది సత్  -  తత్ ఒక్కటే సత్ అన్నారు.
తత్ అంటే  - అది అని చెప్పారు. 
అది అజము. స్వయంభువు. అచ్యుతము. అనంతము.
అది ఒక్కటే సత్. అది ఒక్కటే వున్నది.
ఉన్నది అంటే ఎక్కడవున్నది ? 
అది పరంధామములో స్థితమై వున్నా ఆ తత్ సర్వే సర్వత్ర వ్యాపించి యున్నది.
అది ఆ తత్ అవ్యక్త  సత్తా మాత్ర పరబ్రహ్మ స్థితి. అది అణోరణీయాన్ మహతో మహీయన్ 
అది అపరిచ్చిన్న --- సర్వవ్యాపి .
దానిని  తెలుసుకోడానికి  -  సాధనలు.
భావన   -  సాధన కావాలి. 
నాటి నుండి  నేటి వరకూ  -  మహర్షులు అన్వేషిస్తూ వున్నారు.
ఎరుక గలిగిన మహాత్ములూ  -  జితేంద్రియులు వున్నారు.
శాంతి మంత్రం 
          శ్లో|| ఏకోవసీ సర్వ భూతంతరాత్మ 
                ఏకం  రూపం బహుదాయకరోతి.
               తమాత్మస్థం ఏ z ను పశ్యంతి ధీరా:
               తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం! అని 
తెలుసుకున్నవారు - అనుభవించినవారు
లోకోప కారార్థం ప్రవచిన్చినవారు - అందుకే 
ఆ సాస్వత సుఖము ననుభవించడానికి,
ఆనందించడానికీ నేటికీ మహర్షులు - సాధనలో వున్నారు.
          ఒకే (పరాశక్తి) సర్వభూతములందు వున్నది. ఆ శక్తీ సర్వ రూపములందు వుంది ఆయా భూతములను  చైతన్య పరుస్తూ వుంది. అది తెలుసుకున్న ధీమంతునకే శాశ్వత సుఖము - ఇతరులకు లేదు.
అన్వేషణ మహర్షులు
          యత్ తత్ వ్యక్తస్తమవ్యక్తమ్ విచింత్యతి మహర్షయః 
          అంటే మనకు అవ్యక్తంగా - కనిపించకుండా వుంటూ,  వ్యక్తంగా వుంటూ వున్న పదార్థమును చైతన్యవంతముగా చేస్తూ వున్నటువంటి ఆ అదృశ్య శక్తి ఏది? అని తెలుసు కొనడానికే అన్వేషిస్తూ వచ్చారు - అన్వేషిస్తూ వున్నారు. అన్వేషణలో వారికి తెలిసిన విషయాలనే, అంటే వారు దర్శించిన విషయాలనే లోకహితార్థం మహర్షులు సూత్ర ప్రాయంగా వచించారు. 
అవే వేదోపనిషత్తులు 
వివరంగా 
1. వేదములు --- వేదవేత్తలు సూత్రప్రాయంగా వెల్లడించిన వచనములు - సంహితలు, మంత్రములు
2. ఉపనిషత్తులు --- ఇవి వేదముల చివరి భాగములు. అందుకే వేటిని "వేదాంతములు" అన్నారు
3. దర్శనములు --- బ్రహ్మ ద్రష్టులు తమ తమ తపోబలముతో "పరబ్రహ్మము" ను దర్శించిన వివరములు. 
          ఇందులో చాల సిద్దంతాలున్నాయి. వాదాలున్నాయి. 
        ఈ వేద వాజ్మయము మహా సముద్రములాంటిది. కానీ మనము - వాటి వివరములు కొంత కొంతైనా తెలుసుకోవాలి. అప్పుడే దారి సుగమమవుతుంది. కనుక - ఒక్కటొక్కటిగా - తెలుసుకొనవలసివుంది. మొదట - వేదములను గురించి కొంత అయిన తెలుసుకుందాం. అయితే - వాదములున్నాయి.
వాదములు  
          '' విన దగు  నెవ్వరు చెప్పిన, విని నంతనే వేగ పడక వివరింప దగున్, కని, కల్ల నిజము '' తెలుసుకోవాలి. మనకు  అనుభవ సిద్ధమైన సత్యాలనే విశ్వసించాలి. స్వీకరించాలి.
విశ్వాసం 
సిద్దంతాలు
          మనం మొదట నుండి పెద్దలు చెప్పిన కొన్ని సిద్ధాంతలను ప్రశ్నించ కుండానే  - అనుసరించడం, స్వీకరించడం కు అలవాటు పడి వున్నాము.
          ఉదాహరణకు 
          మనకు గణితంలో కొన్ని సూత్రాలను పెద్దల నుండి పరంపరగా వచ్చాయి.




















                                       .....................ఇంకా  వుంది

No comments:

Post a Comment