WRITER OF SATHYAANVESHANA

SRI SIDDANI MOGILISWAR F/O S. TIRUNAYANA KUMAR, THE BLOGGER WROTE THIS SATHYAANVESHANA IN 2006 AT THE AGE OF 83. IF ANY READER WANTS TO TALK WITH HIM, VISIT HIM AT BLOGGERS HOUSE

Tuesday, January 18, 2011

ఓం శ్రీ సాయిరాం
 రెండవ పుష్పం - భాతి 
          మొదటి పుష్పంలో "తత్త్వమసి" మహావాక్యంలోని 'తత్త్వం' లోని, తత్ ను గురించి 'అది','పర' అని, దానిని గురించి  కొంత తెలుసుకొనబడింది. దానితోకూడా 'త్వం'ను గురించికూడా సూచనప్రాయంగా కొంత తెలుసుకొనబడింది.
త్వం - నీవు 
         'త్వం' అంటే ఇది, ప్రకృతి, నీవు, నేను, అందరూ, అంతా. 'త్వం' ను గురించి తెలుసుకొనడానికి 'నీవు'ను గురించి తెలుసుకుంటే చాలు అని అభిప్రాయం. అందుకే ఈ రెండవపుష్పము 'నీవు' తోనే ప్రారంభింపబడుతున్నది. 
          ఇక్కడొక ముఖ్య విషయం గుర్తించాలి. ప్రకృతిలో ఏ ,ఏ గుణములు, స్వభావాలు, శక్తులు, వున్నాయో, అవిఅన్నీకూడా ప్రకృతిలోని ప్రతి వస్తువునందు, ప్రతి ప్రాణియందూ, నీలోనూ, నాలోనూ, ఇమిడివున్నాయి. అందుకే 'నీవు'ను గురించి తెలుసుకుంటే ప్రకృతినంతా తెలుసుకున్నట్లే అని. అందుకే ఈ పుష్పమును "నీవు ఎవరు?" అని ప్రారంభింపబడుతూవుంది.
             ఇందుకు సమాధానంగా. . . . .
              "నేను రామయ్యను "
              "నేను రంగయ్యను"
              "నేను గోవిందయ్యను" అని బదులు చెప్తారు. 
              నామ,రూప,క్రియా విభిన్నములు గలది, 'అపర', 'ప్రకృతి', 'త్వం'
              నీ పేరేమి, అని అడిగినప్పుడు పేరుచెప్పడం సరియిన సమాధానం కాదు. కానీ, 'పేరు' చెప్పకపోతే వ్యక్తిని గుర్తించలేము. పేరు చెప్పకుండా 'నేను మనిషిని' అని సర్వనామముతో చెప్పితే అది కూడా సమాధానము కాదు. కనుక 'పేరు' చెప్పవలసినదే. ఇందులో గమనించవలసినది ఏమిటంటే, "పేరు" వల్లానే నీవు, నేను, అతను, ఆమె, అని వ్యక్తులను గుర్తించగలము. అంటే ఒక్కొక్కరికి ఒక పేరు, ఒక రూపానికి ఒక పేరు తప్పనిసరిగా వుంటుంది. 
పేరు - నేను 
          ఈ పేరు అనేది ఒక రూపానినికి శరీరానికి పెట్టబడి నదిగా వున్నది. ఈ శరీరం పుట్టినప్పుడు కొన్నాళ్ళకు 'నామకరణం' చేస్తారు. అప్పటినుండి, శరీరం పరిణామాలు పొందుతూ వృద్దాప్యము వచ్చినా ఆ పేరుతోనే పిలవబడుతూ వుంటుంది. 
నేను
         కానీ "నేను" విషయం వేరు.
         పేరు శరీరానికే పెట్టబడినది అయినా, ఏ పేరుతో నైనా, ఏ శరీరంలో నైనా "నేను" వుంటుంది.
        "నేను రామయ్య" ను 
        "నేను సీతమ్మ" ను
        "నేను రహీం"ను 
        "నేను జాన్సన్" ను  అని.
        అని పేర్లు వేరైనా , జాతి, కుల, మతాలు వేరైనా, ఆడ, మగ, పిల్లలు, ముసలి, ఏ తేడాలు లేకుండా, ఆ యా పేర్లతో ముందు "నేను" అని వుంటుంది. 
-------------------------------------------------------------------------
దీన్ని పూర్తిగా చదవాలంటే బుక్ మార్క్స్ లో దాచుకోండి. దీన్ని మేము కొద్ది కొద్దిగా ఎందుకు వ్రాస్తున్నమంటే, ఒకే రోజు చదివితే అర్థం కాకపోవచ్చునని. కనుక దాచుకుని రోజూ కొద్దిగా చదవండి. 
-------------------------------------------------------------------------
        అంటే, పేరు, ఆ శరీరం, రూపము ఉన్నంత వరకూ వుంటుంది. ఆ శరీరము గతించిన తర్వాత, కొన్నాళ్ళ వరకూ గుర్తుంటుంది. ఐతే, శరీరం గతిస్తే, "నేను" ఏమౌతుంది. ఆ శరీరంతోనే గతిస్తుందా? ఉంటుందా? వుంటే . . . . ఎక్కడ వుంటుంది? శరీరం, ఉనికి లేదు కదా!
         శరీరం గతించినా, "నేను" మాత్రం గతించదు. గతించితే సమస్యే లేదు.
       ఈ "నేను" శరీరాన్ని ఉపాధిగా చేసుకుని, "నేను, నేను" అని, అన్నింట్లోనూ, "నాది, నాది," అని అనిపించి, ఆశలు పెంచి కర్మలు కూడా చేయడానికి కొంత కారణమవుతుంది. "నేను" చేసిన కర్మ ఫలితము అనుభవించాలి గనుక, "నేను" గతించదు. ఐతే, ఎక్కాడ వుంటుంది. అనే సమస్య పెద్దది.
శరీరం - వివరణ
        శరీరం గతిస్తుంది. అంటే, శరీరంలోని స్థూల తత్త్వాలు గతిస్తాయి. తక్కినవి పునర్జన్మను ఎత్తుతాయి. అంటే, వాటి వివరాలు నమ్మశక్యం కానటువంటి చిత్ర విచిత్రాలు. అన్నీ నిజాలు. ఆ దైవలీల. దైవ నిర్మాణము.
        ఈ స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరం, దానిలోపల కారణ శరీరం, దానిలోపల మహా కారణ శరీరం వున్నాయి అని అన్నారు. ఇవే కాదు, ఇందులో అన్నమయ కోశము, దానిలోపల ప్రాణమయ కోశము, దానిలోపల మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశములు వున్నాయి అని. అన్నీ స్థూల శరీరములో అమరివున్నాయి. 
         తర్వాత,
         మజ్జ, అస్తి, మాంసము, మేధస్సు, రక్తము, చర్మము, ఇత్యాదులు, మరియు పాదములు, తొడలు, వక్ష స్థలము, భుజములు, వెన్ను, మస్తకము అను అవయవములు, అంగములు కలిగి,  "నేను","నాది", అను అహంకార, మమకారాలకు, ఆశ్రయ స్థానమయినట్టి  దేహము (శరీరము) నే పండితులు స్థూల శరీరము అని పేర్కొన్నారు.
         మొదట,
     ఈ స్థూల శరీరానికి ఉపాధి, కారణభూతములను గూర్చి తెలుసుకొనవలసి వుంది. వాడుకగా, పంచ భూతాత్మకం ఈ శరీరము. మరణమున 'పంచత్వము నొందు తుంది. అని జన వాక్యము. కానీ, వాటి వివరాలను తెలుసుకొనవలసి వుంది.
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
పంచ భూతములు 
        భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశములు పంచ భూతములు. ఈ పంచ భూతములకు వాటి వాటి ప్రత్యేకతలు, గుణములు కలిగి వున్నా, ఇవి సూక్ష్మ భూతములు. ఇవి ఈ శరీర నిర్మాణమునకు వీటికి వలను పడక కొంత త్యాగ భాగములు చేసికొని సంకలన ప్రక్రియా ఫలితముగా ఏర్పడినదే ఈ శరీరము అని తెలుసుకొనవలసివుంది.
         ఈ పంచ భూతములు, పంచీకృతమనబడు ప్రక్రియనంది, వానిలోని అంశములు, పరస్పరం మిలితములై స్థూల శరీరమునకు కారణములగుచున్నవి.
ఇంకా వివరంగా,
       పంచీకృతమును గురించి శ్రీ ఆది శంకరుల వివరము 
       శ్లో|| పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వ కర్మణా 
             సముత్పన్నమిదం స్థూలం భోగాయతన మాత్మనః 
        అంటే పంచీకృతములైన స్థూల పంచ మహాభూతముల వలన ఉత్పన్నమయినది ఈ స్థూల శరీరము. ఇది ఆత్మకు భోగస్థానము. దీని దశ జాగ్రత్ దశ. జాగ్రత్ దశ యందే స్థూల పదార్థానుభవం ప్రాప్తి జరుగుతుంది. 
వివరంగా,
-------------------------------------------------------------------------
దీన్ని పూర్తిగా చదవాలంటే బుక్ మార్క్స్ లో దాచుకోండి.
సతాన్వేషణ గురించి పదిమందికి చెప్పండి  
 Google                           Yahoo
-------------------------------------------------------------------------
         నీరు, నిప్పు, గాలి, భూమి ఆకాశములు పంచ భూతములు. ఇవి సూక్ష్మ భూతాలు. సృష్టి కార్యార్థమై ఇవి పంచీకృతములైనాయి. అంటే పంచ భూతములు. ఒక్కొక్క భూతము తనలోని (1 /2 ) అర్థ భాగమును, నాలుగు భాగములుగా చేసి అంటే 1 /2 x 1 /4 = 1 /8 భాగములు, 4 భాగములయినవి. ఇలాగ  ఐదు భూతములు తన (1 /2 ) అర్థ భాగమును తనలోనే ఉంచుకుని, మిగిలిన అర్థ భాగములోని నాలుగు 1 /8  భాగాలను నాలుగు భూతాలకు పంచి పెట్టినవి. ఆ నాలుగు భూతముల నుండి నాలుగు, నాలుగు 1 /8  భాగాలను గ్రహించాయి.
        అంటే, ప్రతి భూతము తనలో ఉంచుకున్న భాగం          = 1 /2 
                  ఇతర నాలుగు భూతముల నుండి గ్రహించిన 
                  నాలుగు 1 /8  భాగములు (1 /8 x 1 /4 )           = 1 /2 
                                                వెరసి       పూర్ణము           =    1
        అంటే, తన 1 /2 + (4 x 1 /8 )                                    =    1 అయినది.
        ప్రతి పంచభూతము పై విధంగా పూర్ణం అయినది. కనుక అన్నింటిలోనూ పంచభూతాల తత్త్వాలు ఇమిడి పోయివున్నవి. కానీ తన భాగమును ఏ భూతము వుంచుకోన్నదో ఆ భూతము పేరుతోనే అది మహా భూతము అని వ్యవహరింపబడుతున్నది. 
        ఈ విధముగా, పంచభూతములు, పంచ మహాభూతములై, స్థూలములై, ఈ దృశ్య ప్రపంచమునకు ఉపాదనాదులకు మూలకములైనాయి అని వచనము. అయితే పంచ మహాభూతములు ప్రపంచములో వస్తుకోటికి కారణ భూతములవుతున్నాయి కదా. అన్నిటికి పరిణామము, వృద్ధి, జరా, మరణములున్నవా? అని ప్రశ్న.
జర, మరణాదులు  
        శ్లో|| స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మాః
              స్థౌల్యాదయో బహు విధాః శిశుతా వ్యవ స్థా: 
              వర్ణా శ్రమాది  నియమా బహు విధాయ మాస్త్యు:
              పూజూవమాన బహుమాన ముఖా విశేషా:           (వివేక చూడామణి - 93 )
        ఈ స్థూల శరీరానికే జననము, మరణము, ధర్మములు, మానావమానములు కలుగుచుండును. శైశవమాది అవస్థలు కూడా ఈ శరీరానికే కలుగుచుండును. వర్ణా శ్రమ ధర్మములు, యమ, నియమములు దీనికే కలుగుచుండునని గ్రహించాలి. ఇక 
------------------------------------------------------------------------
------------------------------------------------------------------------
సూక్ష్మ శరీరము - దాని తత్త్వములు 
       ఈ శరీరములోని 24 తత్త్వాలు +మహత్తత్వం కలిగి ఇరువది ఐదు (25 ) తత్త్వాలు అమరివున్నాయి. అవి.
         1 పంచ కర్మేంద్రియాలు             -        5
         2 పంచ జ్ఞానేంద్రియాలు            -      5
         3 పంచ మహాభూతాలు            -       5
         4 పంచ తన్మాత్రలు                  -       5
         5 అంతః కారణాలు                   -       4 
                                             -------------------------------
                                                            24 
            మహత్తత్వము                     -       1
                                             -------------------------------
        ఈ దేహములో అమరివున్నాయి.  ఈ వివరములను శ్రీ ఆది శంకరాచార్యులు 
సూక్ష్మ శరీరం 
        శ్లో|| వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాది పంచ,
              బుద్ధ్యాద్య విద్యాపిచ కామ కర్మణీ పుర్యష్టకం సూక్ష్మ శరీర మాహు:     (వివేక చూడామని - 98 )
          అంటే,
          1 వాక్కు మొదలైన కర్మేంద్రియాలు        -      5       -       1
          2 శ్రవణాది జ్ఞానేంద్రియాలు                    -      5       -       1
          3 ప్రాణ వాయువ్యాది వాయువులు        -      5       -       1 
          4 ఆకాశాది పంచ భూతాలు                   -      5       -       1
          5 అంతః కరణ చతుష్టయము                -               -       1
          6 అవిద్య                                                             -       1
          7 కామము                                                          -       1
          8 కర్మ (క్రియ)                                                      -       1 
                                                                                   ------------------
                                                                                            8
                                                                                   ------------------
పుర్యష్టకములు 
        ఈ ఎనిమిదినటిని పుర్యష్టకములు అని అంటారు.
సూక్ష్మ శరీరము 
        దీనినే సూక్ష్మ శరీరము అని ఈ సముచ్చయమును అంటారు.
లింగ శరీరము 
         ఈ సూక్ష్మ శరీరాన్నే "లింగ శరీరం" అంటారు.
         శ్లో|| సర్వవ్యావృతికరణం లింగమం స్యాచ్చిదాత్మనః పుంసః 
               వాస్యాదికమివ తతక్షనస్తే నైవాత్మా భవత్య సంగో_ యమ్
                                                                                      (వివేక చూడామణి - 102 )
        లింగ శరీరము చిదాత్మ స్వరూపుడైన పురుషునకు సర్వ వ్యాపారములను సాధించు కరణముగా వున్నది. ఆత్మ సంగరహితమై వున్నది. నిస్సంగుడు, నిష్క్రియుడు అయిన ఈ ఆత్మ కారణ శరీరములో వున్నది.
కారణ శరీరం 
        శ్లో|| అవ్యక్తమే తత్ త్రిగుణై ర్నిరుక్తం తత్కారణం నామ శరీర మాత్మనః 
              సుషుప్తి రేత స్య విభక్త్యవస్థా ప్రతన సర్వేంద్రియ బుద్ధి వృత్తి:
                                                                                          (వివేక చూడామణి - 93 )
        కారణ శరీరము అవ్యక్తము. దీనితో త్రిగుణములు వున్నది. ఇదియే ఆత్మ యొక్క కారణ శరీరము. సుషుప్తి దీని అవిభక్త దశ. అ  దశ యందు బుద్ధి, వృత్తి యు, ఇంద్రియముల వృత్తులును లీనమైపోయి వుంటాయి.
        వీటిలో స్థూల శరీరం మాత్రం నశిస్తుంది. తక్కినవి కర్మఫలితాల ననుభావించడానికి మరో జన్మను పొందుతాయి. అయితే, కారణముగా వున్న లింగ శరీరములోని కర్మేంద్రియాలు మాత్రం పునర్జన్మలు చాలు గదా! లింగ శరీరం పూర్తిగా ఎందుకు మళ్ళీ జన్మించాలి? అని ప్రశ్న. 
-------------------------------------------------------------------------
దీన్ని పూర్తిగా చదవాలంటే బుక్ మార్క్స్ లో దాచుకోండి.
సతాన్వేషణ గురించి పదిమందికి చెప్పండి  
 Google                           Yahoo
-------------------------------------------------------------------------
దైవలీలలు 
        మంచి ప్రశ్న. ఆత్మ అవ్యక్తమైన కారణ శరీరంతో సంగతి కలిగివున్నది. ఈ కారణ శరీరానికి కారణ ప్రేరకములు పంచ కోశాలు అయి వున్నవి. 25 తత్త్వాలతో  నిర్మింపబడిన మానవ శరీరములో ముఖ్యమైన పంచ కోశాలు కూడా అమరివున్నాయి. అంతా దైవ లీల. చిత్ర విచిత్రములు.
        ఈ దైవలీలలను అవగాహనచేసుకుని మానవుడు చేయగలిగిందేమిటో తెలుసుకోవాలి. 
        ఆ పరమాత్మ సర్వకర్త. సర్వభర్త. సర్వశక్తి సంపన్నము. పరంధామములో పరాత్పరగా వున్న శుద్ధ బ్రహ్మము, చలన బ్రహ్మమై, శబ్ద బ్రహ్మమై, పరమాత్మ సర్వ చరాచరమయమై సర్వం సకాలంలో సక్రమంగా జరుగు రీతిగా ఒక బృహత్పధకము రచించుకొని విశ్వరచన గావించినది. అదే విశ్వము.
        ఈ ప్రకృతి, పాలక దేవతలు ప్రాణులు, చరాచరములు, సర్వం ఈ జగన్నాటకములోని అద్భుతాలు, అనూహ్యాలు. ఈ విషయాలు తెలియ వచ్చినంత మేర  మొదటి పుష్పములో వివరించడం జరిగినది. తర్వాత ఘట్టమే ఈ రెండవ పుష్పము. అంటే ప్రకృతి రచనలో ప్రాణి, మానవుడు. ఒక విశిష్టుడు. "బెల్లం లోని 'తీపి' ని రుచి చూడటానికి, దానిలోని చిన్న ముక్కను రుచి చూస్తే చాలు" అన్నట్లు  ఒక వ్యక్తిని విశ్లేషించడానికి పూనుకుని పూనుకుని ఇంతవరకు వచ్చాము. ఇందులో ఇంతకు ముందు మానవుడంటే, దేహ, ఇంద్రియ, అంతః కారణాల సముచ్చయ సంఘటితమని, అందులో కొంత తెలుసుకున్నాము. ప్రస్తుతం ఆ నిర్మాణంలోని అంతర్గత సూక్ష్మ, సూక్ష్మాతి విషయములను, వాటి పాలక దేవతలను, వాటి స్వభావ కర్తవ్యాలను తెలుసుకొనవలసివున్నది. ముందు అంగాంగ నిర్మాణాలను, ఇక్కడ వాటి క్రియలను గమనించాలి.
పంచ కోశములు
        మన శరీరములోనే అంతర్గతంగా వున్న శరీరములను వాటి కారకత్వములను గమనించాము. 
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
        ఈ శరీరములోనే అంతర్గతంగా మరో విధములైన విభాగములు. వేరు వేరు కారకత్వములు కలిగినటువంటి (5 ) ఐదు విభాగాములున్నాయి. వాటిని పంచ కోశములు అని అన్నారు. అవి 
         1 . అన్నమయ కోశము          2 .ప్రాణమయ కోశము          3 . మనోమయ కోశము         
          4 . విజ్ఞానమయ కోశము         5 . ఆనందమయ కోశము 
       వేరు వేరుగా వీటి వివరములు, తత్వములు తెలుసుకోనవలసి వున్నది.
1 . అన్నమయ కోశము 
        ఇది అన్నము వలన స్థితి కలగినది. అంటే ప్రాణి గ్రహించిన ఆహారమును, జీర్ణావకాశమునకు స్థానము. ఇది త్వక్, చర్మ, రక్తము, ఎముకలు, మలము, మున్నగువాని సమూహము. అనేక తత్వములు. సంఘాతము అన్నారు. ఇది స్థూలము. 'జడము' మానవుడు పుట్టక ముందు లేదు. మరణము తర్వాత వుండదు. కనుక అనిత్యమైనది.
2 . ప్రాణమయ కోశము 
        కర్మేంద్రియములతో (ఐదు) కూడిన ప్రాణమే ప్రాణమయకోశము. 
        ఇది వాయువికారమయినది. ఇందు వాయువు, లోపలికి వచ్చుచు వెలుపలికి పోవుచు వుంటుంది. (ఉచ్చ్వాస, నిశ్శ్వాసములు) ఇది ఇష్ట, అనిష్టములు. 'తన, మన,' అనునది ఎరుగదు. పరతంత్రమైనది. క్రమము కలది. జడమైన అన్నమయ కోశములో వున్నది. 
3 . మనోమయ కోశము 
        జ్ఞానేంద్రియములతో (ఐదు) అంతఃకరణములు మనస్సుతో కూడి మనోమయకోశము అనబడుతుంది. సంకల్ప, వికల్పాలకు, కారణము మనస్సు. ఇది "నేను","నాది" అను వికల్పములకు హేతుభూతమైనది. మహాబలీయమైనది. ఇది అన్నమయ, ప్రాణమయకోశము లందు కూడా పరివ్యాప్తమునంది ఉండును. మనస్సు (వస్తువు కాదు) పదార్థము కాదు. దీనిని ''అవిద్య'' అనియు చెప్పవచ్చునన్నారు. ఇదే జీవునకు బంధము కానీ, మోక్షము కానీ కలిగించుటకు కారణము. యెట్లంటే,
వైదిక మత తత్వాలు - ఆధునిక శాస్త్ర ప్రభావాలు 
        మనమీ పంచకోశాల తత్వాలు, కార్యాలతో తాదాత్మ్య ను పొంది, నిజ తత్వాన్ని, మరచిపోయి, దు:ఖసాగరాన్ని సృష్టించుకొని అందులో మునుగిపోతున్నాము. ఈనాటి ఈ స్థితికి, ఎన్నో శతాబ్దాలకు ముందు నుంచే బీజములు చల్లుతూ వచ్చారనడం సత్య దూరం కాదు. క్రీస్తు  పూర్వం 6 , 5 వ శతాబ్దాలకు ముందు నుంచే ఈ ఆలోచనలు, ఆచరణలు, ప్రారంభమయినాయి.
---------------------------------------------------------------------
దీన్ని పూర్తిగా చదవాలంటే బుక్ మార్క్స్ లో దాచుకోండి.
సతాన్వేషణ గురించి పదిమందికి చెప్పండి  
 Google                           Yahoo
 ---------------------------------------------------------------------
        ఆనాటి కొందరు తత్వవేత్తలు, కొందరు, 
        కొందరిలో కొందరు, జగమంతా జలోద్భవమే వేరేమీలేదన్నారు. 
        కాదు, వాయువే మూలము అని కొందరు అన్నారు. 
        కాదు, అగ్ని కారణము అన్నారు. 
        కాదు, అణు సమ్మేళనమే సర్వ కారణము అని కొందరు.
        మన (తత్త్వ) వేదాంతులు కూడా, ఆకాశమును, వాయువును, అగ్నిని, జలమును, 'బ్రహ్మ' అని కీర్తించి వున్నారు.
        శాంతి మంత్రములో "నమో బ్రహ్మణే, నమస్తే వాయో, త్వమేవ  ప్రత్యక్షం బ్రహ్మ, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి." అని కీర్తించి వున్నారు. 
         కణాదులు, అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వున్నారు.
ప్రజాపతి 
        ఇంద్రుడు, విరోచనుడు. ఇద్దరు సత్యమును తెలుసుకోనాలి అని ప్రజాపతిని  ఆశ్రయించారు. ప్రజాపతి వద్ద ముఖ్యమైన విద్యవిధానము వున్నదని వెళ్లారు.
        ఇంద్రుడు - దేవతల రాజు ; విరోచనుడు - రాక్షసుల రాజు.
        ఇద్దరూ శత్రువులే. అయినా విద్య కొరకు గురువును ఆశ్రయించారు. ప్రజాపతి, కొన్ని సూత్రములు చెప్పి దర్శించు విషయమును వారి వారి కృషికే వదిలేసాడు.  వారికి అర్థం కాలేదు. ఆ ప్రయత్నంలో విరోచనుడు అన్నింటిలోనూ దేహమే ఆత్మ అని భ్రమించాడు. దేహాత్మ భావనతో రాజ్యానికి వెళ్ళాడు. తన రాజ్యంలో ఈ 'దేహాత్మవాదన' ను విరివిరిగా ప్రచారం జరుగుటకు ఏర్పాట్లు చేశాడు.
-----------------------------------------------------------------------------------
ఈ దేహాత్మవాదమును ప్రచారం చేస్తున్నవారిని, విరోచనుని అనుయాయులు కనుక ఈ  వాదము ప్రచారము చేస్తూ  ఉండినట్లు తెలిసిన చార్వాకులు కూడా సాక్తేయులు జాతికి సంబంధించిన వారుగా  అర్థం చేసుకోవచ్చు.
-----------------------------------------------------------------------------------
         19 వ శతాబ్దం నాటికీ చార్వాక మతం ప్రబలి దేశం నలుమూలలా విస్తరించినది. చార్వాకుల ప్రచారం, " సుఖంగా వుండు. చావు తప్పదు. చచ్చిన తర్వాత ఏమి వుండదు. ఈ దేహం పంచ భూతత్మకం, మరణం అంటే దేహం పంచభూతాల తాత్త్వాలతో చేరిపోవడమే రేపు లేదు. పునర్జన్మ లేదు. ఈ దినం ఈ క్షణం నీవు అనుభవించినదే నీది. నీతులు చెప్పేవాళ్ళంతా   గోతులు తీసే వారే" అనే వారి వాదం. ఇది  భూతాత్మ వాదం అని అన్నారు.
       యోని, ప్రకృతి జగత్కారణమంటూ శాక్తేయులు. పాశ్చాత్య దేశాలలో కూడా ఈ వాదాలు, ఇంకా చాలా వాదాలు విచ్చలవిడిగా వ్యాపించాయి. ఎందరో తత్త్వవేత్తలు, పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చారు. 
       ఇలాంటి ప్రచారం చేసిన దేహాత్మవాదుల  ప్రచార తత్త్వ సారాంశాలను గ్రహించి, ఒక మహాశయుడు "మార్క్స్" ఒక సమన్వయ తత్త్వం ప్రతిపాదించారు. అది మార్క్స్ తత్వం ''మార్క్సిజం ''. అందు.......
        1 . దేవుడు లేదు.
        2 . అంతా పదార్థమే.
        3 . పదార్ధం శాస్వాతమైనదే. అవినాశి. దానికి ఆద్యంతాలు లేవు.
        4 . విజ్ఞాన శాస్త్రాలు ఎంతో పురోగతిని సాధిస్తున్నాయి.
        5 . ఎక్కడ దేవుని అవసరం కనిపించలేదు.
        6 . శాస్త్ర ఫలితాంశాలను సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో ఎక్కడా దు:ఖం  వుండదు. ప్రకృతి సంపదను సక్రమంగా, సవ్యంగా, సమతౌల్యంగా మానవాళి వినియోగించుకోనాలి అని.
        "నిషే" అనే ఒక తత్త్వవేత్త , మానవోత్తముని సృష్టించడమే సృష్టి యొక్క లక్ష్యం అని ''నాజీజం'' అనే మతాన్ని స్థాపించాడు.
-----------------------------------------------------------------------------------
(ఇంచుమించు దేహాత్మవాదియే నిషే) అనగా శాక్తేయ జాతికి సంబంధించిన మహాశయుడు కనిపెట్టిందే నాజీజం 
-----------------------------------------------------------------------------------
        ఆ లక్ష్య సాధనను సదుద్దేశంతో  ఆచరిస్తూ ఎదిగి ''హిట్లర్'' అధికారం లోనికి వచ్చాడు. అధికార దుర్వినియోగం, దురాశా, పెరిగి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు. ఎందరో ప్రజలు చనిపోయారు. ఎన్నో కుటుంబాలు దిక్కులేనివై పోయాయి. దు:ఖము, దారిద్ర్యము, తాండవించింది.
        సామ్యవాద సమాజములు సర్వస్య సామ్య సమాజాన్ని స్థాపించాలి. ఇక్కడే భూతల స్వర్గాన్ని స్థాపించాలని మార్క్సిస్టులు ఎంతో కృషి చేసారు. ఎన్నో కలలు కన్నారు. కొంత ప్రగతిని ఐచ్చికంగా కాదు, రాజకీయంగా సాధించారు.
        ఇవి స్వార్థపరులవశమై హత్యా రాజకీయాలకు దారి తీసి,  నక్సలిజం అని కొత్తగా పుట్టి, పెరిగి, హింస విస్తరించి, సామాన్య ప్రజలకు దూరమై అమాయకుల ఆశావలయమై పతనమై పోతూ వచ్చింది. ఇంకా ఎన్నో తత్త్వాలు  పుట్టుకొచ్చాయి. (ఉదా|| మావోయిజం, ఫ్యాక్షనిజం, టెర్రరిజం యిలా ఎన్నో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో తత్త్వాలు పుట్టుకొస్తూ వున్నాయి.)
శ్రీ వివేకానందుడు 
        ప్రాక్, (పశ్చిమ) దేశాలలో మానవత్వం  అంటే ఏమిటో మరుగున పడే జుగుప్సాకరమయిన ప్రవర్తనలు ప్రబలుతూ వచ్చాయి. ఆ వాతావరణ స్థితిలో ఎన్నో తత్త్వాల సారాంశాలని ఆకళింపు చేసుకుని దేశ, విదేశాలలో మానవత్వాన్ని ఉద్దరించడానికి శ్రీ వివేకానందుడు నడుం కట్టాడు. 
        శ్రీ వివేకానందుడు అన్ని కోణాలనుండి  ప్రభోధం సాగించాడు. కనువిప్పుగా, ఒక సత్యం చెప్పాడు. '' సైన్సు ఎక్కడ ఆగుతుందో అక్కడి నుండి 'ఫిలాసఫి' మొదలౌతుంది.'' ఈ వచనంలోని సత్యం ఆనాటి భారతీయులందరికీ అవగతమైనది. యెట్లంటే,
-----------------------------------------------------------------------------------
ఈనాటి  భారతీయులకు అవగతం కానందుకే అన్ని రకాల సమస్యలు (ఉదా|| ఆర్ధిక సంక్షోభం, గ్లోబల్ వార్మింగ్ ఎలా ఎన్నో)  
-----------------------------------------------------------------------------------
         ఈ భౌతికవాద'ఇజాల' వల్ల కానీ, అసురభావోద్రేకాల వల్ల కానీ ,లోకంలో ధర్మం క్షీణించినప్పుడు అధర్మం ప్రబలినప్పుడు, దుర్మార్గులు పెట్రేగి, సన్మార్గులు అనాధలై బాధితులైనప్పుడు ప్రతి యుగంలోనూ ధర్మసంరక్షణా ర్థం, దుష్టశిక్షణ - శిష్టరక్షణ  కొరకు భగవదంశావతారాలు ప్రభవించి రక్షిస్తాయి అని శ్రీ కృష్ణ భగవానుడు ప్రవచించాడు.
        బుద్ధ భగవానుడు, మహావీరుడు, గురునానక్ మహాశయులు, సోక్రెటిసు, ఏసుక్రీస్తు ప్రభవు, మహమ్మద్ ప్రవక్త, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీ వివేకానందులు, మహాత్మ గాంధీ లాంటి యుగపురుషులు అవతరించారు. అవతరిస్తున్నారు. (భగవానుని ఉవాచలో వివరం చూడండి.
        శ్లో|| త్రిభిర్గుణ మయైర్భావైరేభి స్సర్వ మిదం జగత్ మోహితం . . . . . . . . . (గీత : 7 - 13
యెట్లంటే, 
       త్రిగుణముల సంగతిచేత వికల్పము నొందుతుంది  అంటే, రజస్తమో గుణములచేత మలినమై బంధమునకు కారణమవుతుంది. విషయ రూపకమై దు:ఖ హేతువవుతుంది. సత్వ గుణ సంగతిచేత, వివేక వైరాగ్య ముల చేత శుద్ధమై ముక్తికి కారణమవుతుంది. అందుకే, ''మనయేవ మనుష్యాణాం కారణం బంధయో మోక్షయో'' అని అన్నారు. 
4 . విజ్ఞానమయ కోశము 
         ''జ్ఞానేంద్రి యైస్సహ బుద్ధి: విజ్ఞాన కోశః "
         ఇది జ్ఞానేంద్రియములతో కూడి వృత్తియుక్తమైనటువంటి బుద్ధితో కర్తృత్వము గలది. ఇది జనన,మరణ రూప సంసారమునకు కారణమౌతుంది. 
5 . ఆనందమయ కోశము 
        ''స్వరూప జ్ఞానంద కోశః '' అని. 
        ఇది ఆత్మానంద స్వరూపమని చెప్పబడినా, దాని ప్రతిబింబము తమో గుణము చేత ప్రకటితమైన వృత్తి, 
        (క) తన అభీష్టము ప్రాప్తమైనప్పుడు ప్రకటిత మవుతుంది.
        (గ) జాగ్రత్, స్వప్నావస్థలయందు కూడా,ఇష్ట వస్తు దర్శనాదుల  వలన ఇది కొంత ప్రతీతమవుతూ వుంటుంది.
        అన్ని అవస్థలయందు త్రిగుణముల స్వభావ ప్రభావములు ప్రతీతమవుతూ వుండడం గమనార్హం. అయితే ఈ త్రిగుణములే  సర్వకార్య నిర్వహణ ప్రేరకములని చెప్పబడినా,
         ఈ త్రిగుణములు 
         శ్లో|| దేవీ హ్యేషాగుణమయీ మమమాయా దురత్యయా
               మామేవ యే ప్రపద్యంతే మాయామేతం తరంతితే|| (గీత: 7 - 14)
         అంటే 'మాయ' అనే ఊరిలో మానవుడు అజ్ఞాన మోహితుడై దిగబడు చున్నా, దైవసంబంధమై, త్రిగుణాత్మకమైన ఈ మాయను, ఎవరు నన్నే (దైవమునే) శరణు పొందుచున్నారో వారు  దాటగలరు. అంటే, అన్నిటికీ పరమాత్మయే (దైవమే) చైతన్య శక్తి నందించుచున్నది. కర్మలను చేపిస్తూవున్నది. 
----------------------------------------------------------------------
----------------------------------------------------------------------
        ఆ పరమాత్మ మానవ శరీర నిర్మాణము లో కూడా అనూహ్యమైన విధముగా సురక్షితముగా అవయవములను కూడా ఆయా కర్మలను చేయు సౌకర్యముగా అమర్చివున్నది.
అవయవముల అమరిక 
        మన శరీరములో ఇవి అన్నీ వున్నాయి అంటే వాటికి యే సమస్య లేదు. ఇంకా ముఖ్యమైనవి మన శరీరంలో అంగములుగా వున్నాయి. అన్నిటికీ, భద్రత, సౌకర్యమునకు లోటులేకుండా అన్నీ తగువిధముగా సురక్షిత, సానుకూలస్థలమునందు అమర్చబడివున్నాయి.
        (క) ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు అంటే కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, శిరస్సులోనే ఎముకల పెట్టేలాంటి దానిలో భద్రంగా అమర్చబడి వున్నాయి. 
        (గ) ఈ శిరస్సులోనే మెదడు, మజ్జ, నాడీ వికేంద్రీకరణ కేంద్రము అన్నీ అమర్చబడి వున్నాయి.
        (చ) దీనిలోని ఊర్థ్వ భాగమే, ఆకాశము.
        (జ) అక్కడ, సహస్రారము, దివ్యమైన బ్రహ్మరంధ్రము, చర్మముతో కప్పబడి కాపాడబడుతూవున్నది. 
హృదయము
         పరమాత్మ అంశమైన ప్రత్యగాత్మ, జీవాత్మగా శరీరాంతర్భాగంలో హృదయ కుహురంలో నిత్యం, నిరంతరం స్పందిస్తూ వున్న ''అహం'' చైతన్యము. గుండె, శ్వాస కోశములు, ఇతర జీర్ణావయములు అన్నీ భద్రంగా ఎముకల పంజరముగా ఉన్నటువంటి రొమ్ము, వెన్నంటి పెట్టుకుని ప్రక్క ఎముకల గూడులో రక్షింప బడుతూ వున్నాయి. 
         ముఖ్యమైన విసర్జన, జననావయవములు ,తగురీతిని మూలస్తానము అనబడిన, నడుము అనబడు ఎముకల గూటిలో క్రింది భాగమున, తుంటి ఎముకల మధ్య సురక్షితముగా అమర్చబడి వున్నాయి. 
         అన్ని అంగాలు, వాటి వాటి ధర్మములను నిర్వహించుటకు అనువుగా అమర్చబడి వున్నాయి. వాటి నిర్మాణ కౌశలము, కార్యాచరణ సౌలభ్యములు అనూహ్యము, అనన్య సామాన్యము. 
ఆహారం 
        అంగాంగాల నిర్మాణములు తెలుపబడినాయి. ఆ అంగాలకు, వాటి వాటి ధర్మాచరణాలకు శక్తి కావాలి. అందుకు అవసరమైన ఆహారం విషయంలో, ఏ లోటూ లేని విధముగా ఆ పరమాత్మ ప్రపంచములో అన్ని ఏర్పాట్లు చేసివున్నాడు. ఏ ప్రాణికి, ఏ ఆహారం కావాలో, ఏ ఋతువులో ఏ ఆహారం ఆరోగ్యకరమో, అన్నీ ఏర్పాటు చేసి వుంది. ఇది మహాద్బుతమైన విషయం. వివరములు తర్వాత కొంత మేరకు తెలుసుకొనగలం అయితే ఆహారం ప్రకృతిలో పంటగా లభ్యం అవుతుంది.  నీరు, గాలి, ఆహారంలో అవసరమైన భాగమే. ధాన్యం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఆహారంలో భాగాలే. (కానీ మనం తినేందుకు అనువుగా పక్వం చేసుకోవాలి
జీర్ణము - శక్తి 
        మనం తీసుకునే ఆహారం యే విధంగా జీర్ణం అవుతూంది? జీర్ణమైన ఆహారం ఏమౌతుంది? మనకు అవసరమైన రక్తం, శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది? రక్తం శరీరం అంతటా యేవిధంగా సరఫరా అవుతున్నది. దీనికేమైనా సరఫరా చేసే యంత్రాంగం ఉందా? దానికి కారకులెవ్వరు? అనే విషయాలను తెలుసుకొనవలసి వుంది. 
-------------------------------------------------------------------
దీన్ని పూర్తిగా చదవాలంటే బుక్ మార్క్స్ లో దాచుకోండి.
సతాన్వేషణ గురించి పదిమందికి చెప్పండి  
 Google                           Yahoo
 -------------------------------------------------------------------
పంచ ప్రాణ వాయువులు - జీర్ణ శక్తి 
పంచ ప్రాణ వాయువులు 
         ప్రాణుడు, తనంతకు తాను విస్తరించ లేదు. పంచ భూతముల లోని
వాయుదేవునితో తాదాత్మ్యతను పొంది, చలనశక్తిని, క్రియాశక్తిని సంతరించుకున్నాడు. (అందుచేత ప్రాణుడు జీర్ణ శక్తిని, రక్త ప్రసరణ విధమును, శక్తిని ఆపాదించడము ఇత్యాది ప్రక్రియలు నడుపుచున్నది ప్రాణవాయువు. జల, మల, విసర్జనాది క్రియలకు కూడా ప్రాణ వాయువులు కారణములు)
         సక్రమముగా, సమర్థవంతముగా తన కర్తవ్యకర్మలు చేయుటకు తనను  తాను (ఐదు) పంచ విభాగములుగా చేసుకున్నది వాయువుతో తదాత్మ్యతను పొందిన ప్రాణుడు/ప్రాణి.
     1 . ప్రాణ వాయువు 2 . అపాన వాయువు 3 . వ్యాన వాయువు 4 . సమాన వాయువు 5 . ఉదాన వాయువు  అని రూపొందినవి. వీనికి పంచ ఉప వాయువులూ వున్నాయి. 
         శ్లో|| నాగశ్చ, కూర్మ, కృకరో, దేవదత్తో, ధనంజయ ..... అని. అంటే ........
          1 . నాగ వాయువు : వాక్కునందుండి, నవ్వుట, వాకరించుట, మొదలగు క్రియలను జరుపుటకు సహకరించును.
          2 .  కూర్మ వాయువు : కంటి యందుండి రెప్పలు కదలికలకు సహకరించును.
          3 . కృకర వాయువు : ముక్కు నందుండి తుమ్ములు, శీదుట, మొదలగు క్రియలు జరుపుటకు సహకరించును.
          4 . దేవదత్త వాయువు : గొంతు నుండి దగ్గులు, త్రేన్పులు, మొదలగు క్రియలు జరుపుటకు సహకరించును.
          5 . ధనంజయ వాయువు : శరీరమంతటా వ్యాపించి అవసరమగు చోట కండరముల వత్తిడిచే క్రియలు జరిపించును. 
జీర్ణ శక్తి
         పరమాత్మ కీలకం అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ భగవద్గీతలో,
         ''అహం వైశ్వానరో భూత్వా, ప్రాణినాం దేహమాశ్రితః  
         ప్రాణా_పాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం'' అని అన్నారు. అంటే.....
          పరమాత్మ  మన శరీరంలో అన్నిటియందు  ఆవహించి, ఎంతటి కీలక పాత్ర నిర్వహిస్తూ, మానవాళిని రక్షిస్తూ ఉన్నదో గ్రహించాలి. 
           పైగా ఆహరం, 
           ఒక ప్రాణికి కాదు , సర్వ ప్రాణులకు. 
           ఒక పూట కాదు, ఒక దినం కాదు, జీవితాంతం. 
           జీవితాంతం కాదు, యుగాయుగాలూ ప్రాణులు తీసుకునే ఆహారం జీర్ణం కావాలి, శక్తి రావాలి, ప్రాణులు బ్రతకాలి. కనుక అవి బ్రతికినంత కాలం నిర్విరామంగా అవిశ్రాంతగా ఆ పరమాత్మ ప్రాణుల ఉపాధులలో 
          ''తానే వైశ్వానరుడై, అగ్నులై, ప్రాణ, అపాన వాయువుల మధనం ద్వారా ఆహారాన్ని పచనం చేస్తూ ప్రాణులకు శక్తి ఉత్పత్తి'' ని కలుగజేస్తున్నారు .
         దీనినంతటినీ ఏమి ప్రతిఫలం ఆశించి పరమాత్మ చేస్తున్నారని ప్రశ్నించుకుంటే, ఆ పరమాత్మకు మనమీద ఎంత దయ ఉన్నదో గ్రహించగలం.
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
           ప్రస్తుతాంశం 'ఆహారం ఎలా జీర్ణమవుతుంది?' అని.  శ్రీ కృష్ణ  పరమాత్మ ''ప్రాణా_పాన సమాయుక్తా'' అన్నారు గనుక మొదట ఈ ప్రాణాపానములను అర్థం చేసుకొనవలసివుంది.
పంచ ప్రాణ వాయువులు 
          ప్రాణవాయువు తన విధ్యుక్త కార్యమును సక్రమముగా నిర్వహించుటకు సౌలభ్యముగా వుండుటకై తనను తను 5 (ఐదు) విభాగములుగా చేసుకుని కార్యభారాలను పంచుకున్నది. అవే ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు అని ఇది వరకే తెలుసుకొని వున్నాము.
1 . ప్రాణవాయువు 
          సప్తాగ్నులు - కామాగ్నులు ఆయువు పట్టులు.
         ప్రాణులు ఆత్మనావరించుకొని ఆత్మస్థానమైన హ్రుదయంనే తన కేంద్ర కార్యాలయంగా వుంచుకొనినా సక్రమంగా కార్యనిర్వహణ జరుపుటకు సప్త కేంద్రాలను ఎన్నుకొని వున్నాడు.
          అవి      కన్నులు                                           -     2
                     నాసికా రంద్రాలు                                 -     2
                     చెవుల మూలాలు (గూబలు)               -     2
                     నోరులో అంగిలి (గొంతు)                      -     1 
                                                                           ----------------
                                                                                    7 
                                                                           ----------------
          7  అంగముల అంతరములు ఈ  ఏడు స్థానాలలో ఏడు ప్రాణాగ్నులను సముద్భవింప జేసుకొని అందు జనించు ఉష్ణోగ్రతలను, రక్త ప్రసరణమునకు సహభూతులుగా ఉంచుకొన్నాడు అని వచనములు.
         ఈ సప్తాగ్నులనే  కామాగ్నులు అని కూడా అంటారు. ఈ సప్తాగ్నుల వేడిమినే శరీరములోని వేడిమి అని, ఈ కామగ్నులు చల్లబడితే దేహం చల్లబడుతుంది అని అభిప్రాయం. ఈ సప్తాగ్ని కేంద్రాలనే ''ఆయువు పట్టులు'' అని అంటారు. 
2 . అపానవాయువు 
         ఇది జననేంద్రియాలను ఆవరించుకొని నాభికి దిగువ పొత్తి కడుపులో స్థితమయి వుంటుంది అన్నారు. పొత్తి కడుపులోనే ప్రాణ, అపాన వాయువుల మధనం జరుగుతుంది. జీర్ణక్రియలో ఇందుకు  తగిన రసములు చాలా కలుస్తాయి. అంటే నోటిలోనికి ఆహారం ప్రవేశించినది మొదలు పొత్తికడుపులో చేరువరకు రసములు అవసరమైనంతమేరకు గ్రంధుల నుండి చేరుతాయి. 
         జీర్ణక్రియ ఆహారంలోని రక్తాంశాన్ని ప్రాణవాయువు గ్రహిస్తుంది. పిప్పిని అపానవాయువు జల,మల,విసర్జన అవయవముల ద్వారా బహిర్గత మొనరిస్తుంది. 
          సృష్టిలో చాలా విచిత్రాలున్నాయి. 
          ముఖ్యంగా ఆహారం, రక్తం, రక్త ప్రసరణ, రక్త శుద్ధి, అల్లాగే మల, జల, విసర్జనములందు చక్రబంధనం లాంటివి వున్నాయి.
గుండె - ఊపిరితిత్తులు - రక్తశుద్ధి 
          జీర్ణమైన ఆహారమునుండి రక్తమును ప్రాణవాయువు గ్రహించి శరీరమంతటికీ సప్తాగ్నుల సహాయముతో ఆ రక్తమును సరఫరా చేస్తుంది అని గ్రహించాము.
          1 . పరిశుద్ధమైన రక్తమును వ్యాన, సమాన వాయువులు శరీరమంతటికీ సరఫరా చేస్తాయి.
          2 . శరీర అంగాలు కృషి చేస్తూ, అలసినందువల్ల మలినములేర్పడి ఆ మలినముల వలన రక్తము కలుషితమవుతుంది.
          3 . ఆ కలుషిత రక్తము వేరునాళముల  ద్వారా గుండెకాయకు చేర్చబడతాయి.
          4 . ఆ కలుషిత రక్తమును గుండెకాయ, ఊపిరితిత్తులలోనికి పంపుతుంది.
          5 . మనం నిత్యము, నిరంతరము పీల్చు గాలి ప్రాణవాయువు (అదే ఊపిరి.) ఊపిరితిత్తులలోనికి చేరుతూ వుంటుంది.
          6 . ఈ ప్రాణవాయువు వలన కలుషిత రక్తము ఊపిరితిత్తులలో శుద్ధి చేయబడుతుంది.
          7 . శుద్ధి చేయబడిన రక్తమును గుండెకాయలోనికే చేర్చబడుతుంది.
         8 . ఈ పరిశుద్ధ రక్తమును శరీరమంతటికీ  రక్తనాళముల ద్వారా సరఫరా చేయబడుతుంది. 
          ఈ క్రియలు, ప్రాణికి, బ్రతికివుండునంతవరకూ అవసరములు. 
--------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------
లింగ శరీరము - తత్త్వములు - స్వభావములు 
          తత్త్వములు అవ్యక్తాలు. అయినా సంకలన, వ్యవకలనము వలన ఒక పూర్ణత్వము పొందుతున్నాయి. అయినా ఏతత్వమునకా స్వభావానుగుణంగా ఆయతనాలు క్రియాత్మకమవుతాయి. క్రియాత్మకములయినప్పుడు కర్మేంద్రియాలు వేరు వేరుగా వాటిని విభజించడం కుదరదు. సంపూర్ణములను సంపూర్ణంగానే గ్రహించాలి. ఏ తత్త్వం చేసిన కర్మ, ఆ తత్త్వమే అనుభవించాలి. స్థూలంగా ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి అన్నారు. తప్పదు. 
          అయితే, ఇంతటి విశాల విశ్వంలో, విస్తరిస్తూ వున్న ప్రకృతిలో లక్షలు, కోట్ల, ప్రాణులు క్షణక్షణమూ కర్మలు చేస్తూనే వుంటాయి. 
          జీవకోటిలో ఎవరు, ఎప్పుడు, ఏ జన్మలో, ఏ కర్మ చేశాడు? ఆ కర్మ తత్త్వము, భావము ఎందుకు చేశాడు? దానికి తగిన ప్రతిఫలమేమిటి? అది ఎంతటిది? అని లక్ష సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందులో ఎప్పుడో పూర్వ జన్మలో చేసిన కర్మలు ఎవరు చూశారు?  ఎవరు చెప్పగలరు? వాటి ప్రతిఫలములను అనుభవించడానికి, ఆ ప్రతి ఫలముల నిర్ణయము, నిష్పాక్షికంగా చెప్పాలి కదా! ఇది సాధ్యమా? పొరబాటు జరిగితే అపకారాలు జరుగుతాయి గదా! ఒక్కొక్కరు బహిరంగంగా, అంతరంగంగా, అసలు రహస్యంగా ఎన్నో క్రియలు చేస్తుంటారు. అంతరంగంలోగాని, రహస్యంగాకానీ, చేసే ప్రతిక్రియకు ప్రతిఫలం విధించడం ఎలా సాధ్యమవుతుంది? పదిమంది వస్తువులను ఒకచోట, ఈ దినం కలిపిపెట్టి, రేపు ఎవరి వస్తువులు, వారికియ్యడానికే ఎంతో కష్టమూ, పొరబాట్లు, జరుగుతున్నాయి గదా. లక్షల కోట్ల మంది ఎప్పుడో చేసిన క్రియలు, ప్రతిఫలము ఎలా తెలుస్తాయి. ఒక్కనిముషం......
చిత్రగుప్తుడు -యమధర్మరాజు 
          మన పురాణాలలోని చిత్రగుప్తుని - యమధర్మరాజును గురించి పామరులకు కూడా బాగా తెలుసు. వీరు రూపాలా? రూపకల్పనలా? అనే తర్కం వద్దు. వారి క్రియలు, తత్ప్రభావాలాను గమనిద్దాం. ఆశ్చర్యకరంగా, అద్భుతంగా వున్న నిర్మాణాలను ''మయ'' నిర్మితంలా వుంది అని 'నానుడి' గా అంటారు. ''మయ'' , ''మాయ'' , ''మహిమ'' అన్నీ కూడా మహేశ్వరుని   లీలా విశేషాలే.
--------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------
         'మ' - 'య' కల్పన. 
         మనస్సులోని 'మ' - నియమములోని 'య'
         వాటిని  విపర్యముగా చదివితే 'య' - 'మ'
         ఎవరి 'మ'నస్సులోని 'య'త్నములను తిరగవేస్తే, వారి క్రియలు వెనుతిరిగి చూస్తే , వారి ''యమ''ములే అవుతాయి. ఇది భావన మాత్రమే కాదు. బొమ్మ - బొరుసు లాంటిది. 
          'మయ', 'మాయ' కలిగించే ఆకర్షణ, భ్రాంతి , భ్రమలకు విపర్యము. ఫలితములు 'యమ' ధర్మరాజు విధిస్తాడు. ఇది సర్వ సమస్తమునకు అన్వయము. అయితే, ఎవరి/ అందరి కర్మలు, వాటి ఫలితాలు యెట్లా తెలుస్తాయి? అనే సమస్య మనకు అంటే ఆధి భౌతికముగా ఆధి దైవికముగా ఈ సమస్యకు సమగ్రమైన నిర్దుష్టమైన విధానముగా ఫలితాలను జగన్మాత రెండు కోణముల నుండి ఏర్పాటు చేసివుంది. ఏ పొరబాటు కూడా  జరుగకుండా ఉండేలా ఏర్పాటు చేసివున్నది. యెట్లంటే. . . . . .
          ప్రధమం, ఎవరు చేసిన కర్మవాసనా పాశములు, దూతల్లగా , కర్మ చేసిన వాని సూక్ష్మ శరీరాన్ని, జీవుని బంధించి ముద్రవేసి, వారి కర్మానుసారముగా, ఉత్తమ, మధ్యమ, అధమ, యోనులందు పడవేస్తాయి. దీనిని ఇదివరకే గ్రహించాము. జీవుని ఆయా యోనులందు పడవేసిన 'పాశములు' బంధములను వదలవు. అందుకే జీవుడు బద్ధుడుగా పుడతాడు. అంటే వారి జన్మలవరకే పాశముల కర్తవ్యము అని అభిప్రాయము.
           తర్వాత, ముందు జన్మమునగానీ, ఈజన్మలోగానీ, జీవుడు చేసిన చేస్తున్న ప్రతి క్రియా, ప్రతిక్షణం ఎప్పటికప్పుడు, చిత్ర రూపమయి, వాటికి అనుభవించాల్సిన  ప్రతిఫలము  కూడా ప్రక్కనే ముద్రితం అయిపోతూవుంటుంది. ఇలాంటి అద్భుతమైన (యాంత్రిక) క్రియా విశేషమును సృష్టి ప్రారంభానికి మొదటే ఒక సమగ్రమైన నిర్దుష్టమయిన ప్రణాళిక విధానాన్ని ఆ 'పరదేవత' జగన్మాత రచించుకున్నది. తర్వాతనే సృష్టి ప్రారంభమయినది అని. కనుక ఎక్కడా చిక్కులేదు. సమస్య రాదు. 
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------
          కానీ, ఈ చిత్రములు, ముద్రితములు. జీవుని అంతరంగమునందు ఈ చిత్రములను ముద్రించి, దాని ప్రతిరూపును, సరియైన 'నఖలు' (జిరాక్స్) ని చిత్రగుప్తుడు గుప్తపరుస్తాడు. అందుకే అతనిని చిత్రగుప్తుడు అన్నారు. కానీ, ఒక్కొక్క జీవుడు ప్రతి క్షణమూ చేసే క్రియలు రకరకాలుగా ఉండవచ్చు. ఎన్నో ఉండవచ్చు. అలాగా ప్రపంచంలో కోట్లకొద్దీ (ప్రాణులు) జీవులు చేసే క్రియలు లక్షలు, కోట్లు, అర్బుదాలు దాటుతాయి. ఇన్నిటినీ ఎక్కడా దాచగలడు. ఎంతకాలమైన అది చెక్కు చెదరకుండా యెట్లుండ గలవు అని కొంచెం ఆలోచించండి. 
          విశ్వమెంత విశాలమో తెలియదు. ఈ విశ్వమును ఆవరించుకొని వున్న ఆకాశమెంత విశాలమో  ఊహించలేము. అందుకే 'ఆకాశం - గగనం' గ్రహించడం గహనం అన్నారు. 
          ఒకప్పుడు, చెప్పితే నమ్మశక్యంగాని,  సత్యాలను సులభంగా నమ్మడానికి ఆధునిక శాస్త్ర విజ్ఞానం చాల వుపకరిస్తూవుంది. వీరి పరిశోధనల వలన, రేడియోలు, ఆడియోలు, వీడియోలు, ఫోనులు, సెల్ ఫోనులు వగైరాలు అన్నీ అనుభవంలోనికి వచ్చాయి. ఇంకా చాలా వస్తున్నాయి. కోట్ల కొద్దీ పాడిన, పలికిన 'శబ్ద తరంగాలు', 'చిత్ర తరంగాలు' ఆకాశంలో యెట్లా భద్ర పడి వున్నాయో తెలియదు. ఆ తరంగ దైర్ఘ్యాలకు, సాంద్రతకు సమములైన తరంగ దైర్ఘ్యముల 'మీట' నొక్కితే వెంటనే మనం మన ఇంట్లో కూర్చొని చూడగలం. వినగలం. ఎప్పుడో పాడిన పాటలు, పలికిన పలుకులు, చెక్కు చెదరకుండా వుంటాయి.
          ఉంటాయి అంటే వాటికి కూడా చిత్రగుప్తుడు అవసరమే. అంటే వాటిని, వాటితో కూడా యంత్రమును చక్కగా ఉంచుకోనాలి. ఈ క్రియా తరంగాల విశేషం ఆ జగన్మాత రచన. (ఫ్లాపీ లాంటిది)
          ఆధునిక శాస్త్రజ్ఞుల శ్రమ ఫలితముల ప్రభావము.
          ఇవి లేకపోయివుంటే  ఈ విషయాలను వివరించాలంటే బండెడు గ్రంథాలు, వందల ఆచార్యులు చాలరు. కనుక ప్రత్యక్ష ప్రసారాల సాధనా యంత్రాలను సాధించిన ఆధునిక శాస్త్రజ్ఞులకు జోహార్లు. 
          కనుక, ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు సాధించిన అద్భుతాలకంటే మహాద్భుతమైన యంత్రాంగంలాంటి విధానాన్ని ఏర్పరచి, నిర్దుష్టంగా నిర్వికారంగా నిరంతరం పనిచేసే విధానాన్ని ఆ పరాశక్తి ఆదినుండి పని చేయిస్తూ వుంది. సర్వశక్తి సంపన్నురాలైన ఆ తల్లి రచనా విధానం నిర్దుష్టము. నిశ్చయము. అలుపు సొలుపు ఎరుగదు. మరమ్మత్తులు రావు. (రిపేర్లు రావు) కర్మానుభావములు ఎవరు అనుభవించాలి!
--------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------
          ''ఎవరు చేసిన కర్మ వారనుభవింపక, ఏరికైనను తప్పదన్నా! ఏ నాడో, ఏ తీరో, ఎవరు చెప్పగలరు. . . . .'' అనే ప్రాచీన తత్వపాదమును ఇది  వరకే గమనించాము. అయినా మన సమస్యకు సమాధానం కావాలి! 
          ''కర్మలు చేసింది దేహములోని ఇంద్రియాలే కానీ, నేను కాదు. కర్మలు చేసి అవి గతిస్తే, ఫలితాలను నేను ఎందుకు అనుభవించాలి? నాకేం సంబంధం'' అంటుంది మనస్సు.
           ''యజమాని (శరీరం) చెప్పిన పనిని  చేశాము.  అంతే కర్మలు, వాటి 'లాభనష్టాలు' మాకేం సంబంధం'' అని అంటాయి ఇంద్రియాలు.
          ''నేను, నాది'' అని అహంకరించిన అహం, అహంకారంగా మనసులో అంతర్గతంగా వుంది.
          కర్మలు చేసేది - దేహ,ఇంద్రియాలు.
          కర్మలు చేయించేది -మనసు.
          నేను అనేది - పెద్ద అహంకారము 
          నాది అనేది - మమకారము (ఆశలు పెంచేది) 
          దేహేంద్రియాలు కర్మలు చేస్తున్నాయి. 
          అంతఃకరణ (మనసు) కర్మలు చేయిస్తున్నాయి.
          అన్నిటికి తుష్టిని, పుష్టిని ప్రాణము  కలుగజేస్తుంది.అయితే వీటి మధ్య ఒకసారి ''మేము గొప్ప'' అనే వాదులాట జరిగింది. ఇవి యిలా వాదులాడుకుంటూ వుంటే పరిష్కారం కావాల్సి వచ్చింది.
----------------------------------------------------------------------------------
                                     గమనిక : అహం -అహంకారం 
                                                    ఇక్కడ అహం వేరు. అహంకారం వేరు. 
                                                    అయితే చాలా సున్నితమైన తేడా
-----------------------------------------------------------------------------------
ప్రశ్నోపనిషత్తు 
          ఇక్కడ, ప్రశ్నోపనిషత్తులోని రెండవ ప్రశ్నకు పిప్పిలాద మహర్షి వచనములు మనకు శరణ్యములు.
          రెండవ ప్రశ్న రెండవ వచనంలో, ''ఆకాశమే దేవుడు అని, వాయువు, అగ్ని, జలము అంతా భూమి అని, మనసు, వాక్కు, కళ్ళు, చెవులు అన్నీ తమ శక్తులుగా ప్రకటించుకుని ఈ శరీరాన్ని మేమే ధరించి భరించి పోషిస్తున్నాము. వేరేమి లేదు.'' అని గర్వంగా చెప్పుకున్నాయి.
          ఇంతలో ప్రాణం (మూడవ వచనంలో) ''గొప్పలు చెప్పుకోకండి. ఈ నా ప్రాణశక్తి, విశ్వశక్తిలో ఒక భాగంశమే అయి, నా ప్రాణశక్తే అభివ్యక్తమయి  కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములన్నిటి యందు, ఈ శక్తి ప్రకటితమై అన్నిటి చేత పని చేయిస్తూ వుంది.'' అని చెప్పింది. 
          కానీ, ఇంద్రియాలు నమ్మలేదు. ప్రాణం అభిమానపడి, ''సరే నాతో పనిలేదు గదా! మీ మీ శక్తులతో మీరు పనులు నడిపించండి. నేనెందుకు ఇక్కడ? '' అని నిష్క్రమించడానికి సిద్దపడింది. ప్రాణం అలా సిద్దపడిన కొంతసేపటికే శరీరంలో అన్ని అవయవాల పని నిస్త్రాణమయి, నిర్వీర్యమయినాయి.(సుస్తు పడ్డాయి.)
          అప్పుడు, ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని బ్రతిమాలుకున్నాయి. తర్వాత, మళ్ళీ ప్రాణం శరీరంలో స్థిరపడితే, అన్ని అవయములు కుదుటపడినాయి అని వచనం. 
ప్రాణం 
          పై వచనంలో 'గొప్పలు చెప్పుకున్నవి ఇంద్రియాలే కాదు. మనస్సు కూడా వాటితో కలిసినది. మనస్సు అంటే అంతః కరణాలే. మనో, బుద్ధ్య ,హంకారాలు, చిత్తము కూడా అంటే ప్రాణమే వీటిని నడిపించే శక్తి అని గ్రహించవలసి వుంది. కానీ,
----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------
          7 వ వచనంలో, '' ప్రాణమే అన్నీ అని అనుకుంటే. . . . . .ప్రాణము, జీవము కూడా,అంతఃకరణాలపైన, ఇంద్రియాలపైనా ఆధారపడి వున్నాయి అని భావించవలసివున్నది. ఎందుకంటె, ఇంద్రియాలు తమ తమ విషయాలను ఇంద్రియార్థాలైన విషయాలను సేకరించడం తమ కోసం కాదు, మనస్సునకందించి, మనస్సు ద్వారా శరీరంలోని 'జీవాన్ని 'ప్రాణం ద్వారా పోషించడానికే అని వచనం.
ప్రాణము - మనస్సు - ఇంద్రియాలు -విషయాలు 
          ప్రశ్నోపనిషత్తులోని వచనాల ద్వారా గ్రహించినదేమిటంటే . . . . . . 
          ప్రాణం ఎవరు? ఎక్కడా పుట్టింది? శరీరంలోని 'జీవాన్ని' పోషించే బాధ్యత దానికెందుకు? మనస్సుకు, ఇంద్రియాలకు శక్తినియ్యడం, ఎలా జరుగుతుంది? అనేవి ప్రశ్నలు.
          ప్రణవము నుండి ప్రభవమందినదే దివ్య శక్తి. అపరిచ్చిన్నమైనది. మహాదావకాశం. ఘటాకాశంలాగా, పరమాత్మ, ప్రత్యగాత్మ, జీవాత్మనందినవి. ప్రత్యగాత్మే కూటస్థుడు. సాక్షీభూతుడు, నిర్వికారుడు. పురుషుడు. జీవాత్మ తన ఉపాధ్య సరాలలో తగుల్కొని బందీ అయివున్నాడు. ఆత్మను ఆవరించుకొని పోషిస్తూవున్నది ప్రాణము. 
          పరమాత్మ చైతన్యమునుండి చైతన్యశక్తిని  గ్రహిస్తుంది. అన్నం జీర్ణమై రసమైన శక్తిని, సర్వేంద్రియాలకు, దేహానికి సరఫరా చేస్తుంది. అందులో సూక్ష్మాంశమును అంతఃకరణాలకు అందించి, అందులో సూక్ష్మాంశమును అనుభవిస్తుంది అని.
          ఇది కాకుండా, జీవుడు అశనగతుడు. ప్రాణుడు అశనము. ఇది ప్రాణవాయువు నుండే గ్రహింపబడుతూవుంటుంది అని శాస్త్రం.
          కనుక, దేహము, ఇంద్రియాలు, అంతఃకరణాలు, ప్రాణము, జీవుడు (ఆత్మ) ఒకదానిపై ఒకటి ఆధారపడి వాటివాటి గుణములు, స్వభావములను అనుసరించి కర్మలు చేస్తున్నాయి.
            దేహ, ఇంద్రియ, అంతఃకరణాలు, వాటివాటి గుణములను, స్వభావములను అనుసరించి కర్మలు చేస్తున్నాయి అంటే . . . .అవి స్వతంత్రించి కర్మలు చేస్తాయా లేక శరీరంలోని, ''ప్రాణము'' జీవుని అభీష్టము మేరకు కర్మలు చేస్తున్నాయా అని.
          జన్మతః వచ్చిన పూర్వ జన్మ వాసనలు, ప్రకృతి జన్య గుణములను అనుసరించి కర్మలు చేస్తాయి అని శాస్త్రోక్తములు.
--------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------
ముఖ్య గమనిక - కర్మల విషయం 
          1 . అహం వేరు, అహంకారము వేరు.
          2 . అవయవములు, వాటి వాటి గుణ, స్వభావములను అనుసరించి అంటే ...........కళ్ళు చూడగలవు , కాళ్ళు నడవగలవు, చెవులు వినగలవు, చేతులు పనిచేయగలవు. ఇవి వాటి స్వభావములు.  అందుకు తగిన విధముగా అవయవ నిర్మాణము, శరీరములో అమరికలు వున్నాయి. 
          శరీరంలోని విషయాలు, ప్రకృతిలోని విషయాలు సూక్ష్మంగా పరిశీలిస్తే అన్నిటియందు నామ,రూప,భేదములు మాత్రమున్నాయి. తక్కిన విషయములందు సమత్వమే, సమచైతన్య ప్రక్రియలే తేటతెల్లములవుతాయి. యెట్లంటే, 
          మానవుడు        - వ్యష్టి
          ప్రకృతి               - సమిష్టి
          పాలక దేవతలందు కూడా మార్పు కనపడలేదు.
ప్రకృతి - మానవ శరీరము 
          ప్రకృతిలోని విత్తనములు - మానవునిలోని వీర్యం, బీజము సమమే.   
          ప్రకృతిలో విత్తనములో వృక్షము సర్వము సూక్ష్మంగా అణిగివున్నట్లే, మానవునిలోని వీర్యంలో, శరీర, అంగాలు అన్నీ ఇమిడివున్నాయి.
          అయితే, తేడా ఏమిటంటే, మానవుని జన్మకు అతని పూర్వ జన్మ వాసనలను అనుసరించి పుట్టుక జరుగుతుంది. ప్రకృతిలోని సర్వం (ఒక యంత్రం లాగానే) మనవ శరీరం సాదృశ్యంగానే వున్నది. వివరంగా . . . . 
అంగాంగాలు - అధిష్టాన (అభిమాన) పాలక దేవతలు 
          శరీరంలోని అంగాలను (అవయవాలను) నడిపించే విధానము, శక్తి అంతా, అన్నీ ప్రకృతిలోనూ అధిష్టాన, పాలక దేవతల శక్తి అధీనములలోనూ సామ్యము వున్నది. అన్నిటిని, ప్రకృతిని, శరీరమును, కారణకార్యములు, సృష్టిని ఆ పరదేవత అనుగ్రహ పాలన, పర్యవేక్షణలోనే జరుగుతూ వున్నాయి.
          దేహో దేవాలయం ప్రోక్తా I  జీ ఓ దేవస్సనాతనః I I 
అనే దేవాలయంలోని దేవుని పర్యవేక్షణ, సర్వత్రా వుంటుంది. వివరంగా. . . . . 
  1. ప్రాణ వృత్తికి                పగలుకు దేవత                 మిత్రుడు
  2. అపాన వృత్తికి              రాత్రికి దేవత                   వరుణుడు
  3. కనులకు                    సూర్యతేజస్సుకు దేవత                అర్యముడు 
  4. ఇంద్రియములకు         బలమునకు దేవత                       ఇంద్రుడు
  5. మేధస్సు (బుద్ధికి)        వాక్ శబ్దమునకు దేవత                బృహస్పతి  
  6. అంతరము                 బాహిరాభివృద్ధికి దేవత          విష్ణువు
  7. నోరు                        వాక్కునకు దేవత                          అగ్ని దేవుడు
  8. ముక్కుశ్వాస              ప్రాణంనకు దేవత                           వాయుదేవుడు 
  9. కన్నులకు                 దృష్టికి దేవత                    సూర్య భగవానుడు
10. చెవులకు                   వినికిడి శక్తికి దేవత              దిక్పతులు
11. చర్మము                    రోమములు,వృక్షాదులకు దేవత  సోముడు 
12. హృదయము, మనస్సు,సౌమ్యమునకు దేవత            చంద్రుడు
13. బొడ్డు,నాభి,                అపానం, మధనంలకు దేవత      అపానవాయువు
14. జననాంగము              రేతస్సునకు దేవుడు            నీరు
           ఈ విధముగా అన్ని అంగాలకు పాలక దేవతలు వున్నారు.
-------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------
శరీరం - పిండోత్పత్తి 
          ఈ విధంగా అన్ని అంగాలకు ఆయా దేవతలు చైతన్య శక్తిని కలుగజేసి, వాటి వాటి ''స్వ''ధర్మాలను కర్తవ్యాలను నిర్వహింప చేస్తుంటారు.  
          ఒక యంత్రంలో చిన్నమర (బోల్టు లేక స్క్రూ)  సరిగా లేకపోతే యంత్రం పని ఏమౌతుందో అందరికీ తెలుసు. అలాగే, మన శరీరంలో చిన్న అంగం సరిగా లేకపోతే శరీరం అస్వస్థత, అనారోగ్యం, జాడ్యాలతో, బాధ  పడుతుంది. తన కర్తవ్యం చేయజాలదు. అన్నీ బాగుండాలి. కనుక, శరీర స్వస్థత విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ఆహార విహారాలలో జాగ్రత్త వహించాలి.
మానవుని పుట్టుక విషయం 
          మానవుని పుట్టుకకు చాల కరణాలు, సంకలనాలు, సంయోగాలు వున్నాయి అని. అయినా మనలో తను, మను, ప్రాణాలున్నాయి. వాటిని గురించి సంక్షిప్తంగానైనా తెలుసుకుంటే, వాటి ఆరోగ్యాన్ని, సౌష్టవాన్ని గురించి ఏమి చెయ్యాలి అనే విషయాలు తెలుసుకోగలం. శాస్త్రోక్తాలు చాలా వున్నాయి. వాటి సమన్వయ, స్వరూప, స్వభావాలను, తెలుసుకొనడం మంచిది.
జన్మకు కారణాలు - సమయములు 
         1 . మొదటి కారణం, పూర్వ జన్మ వాసనలు. ఈ వాసనా ప్రభావలె జీవుని ఉత్తమ, మధ్యమ, అధమ, జన్మలకు కారణాలు.
         2 . పై ప్రభావాలను అనుసరించి శుభాశుభాములను శీలించి, అన్వయించి, తగు ''యోను''లను సమిష్టిగా నక్షత్రాలు, గ్రహాల ప్రమేయంతో కాలచక్ర బంధంలో తగు సమయమునందు అంటే లగ్నమందు బీజాన్ని గర్భస్థం చేయడం జరుగుతుంది. 
          ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయము, స్త్రీ, పురుష సంయోగ సమయము ''గర్భస్థ  సమయము'' అని తలచినా, శుక్ల, శోణితముల సంయోగము ఫలప్రదము దైవానుగ్రహ సమయమునందే జరుగుతుందని శాస్త్రములు అంటున్నాయి. 
          3 . పూర్వజన్మ కర్మఫలితాలకు జీవుడు అనుభవించాలి గనుక, అందుకు తగిన గృహ వాతావరణము, గర్భం, స్థితము వగైరాలన్నీ గుణముల ప్రమేయంతో కూడా జరుగుతుంది.
           4 . తగిన వాతావరణం గల కుటుంబము అంటే, ఆహారవిహారాదులు సరిపడు గృహము. స్త్రీ, పురుషుల విషయములు కూడా నిర్ణయం  ఏర్పడుతుంది. 
          ఎందుకంటే, ఆ కుటుంబంయొక్క ఆహారము, ఆలోచనాసరళి, అలవాట్ల ప్రమేయంవలన రేతస్సు, శుక్ల, శోణితాలు ఏర్పడుతాయి. వారి గతజన్మల, వర్తమాన జీవిత కర్మల విధానాలు వాసనలను పరిగణించి, ''యోని'' నిర్ణయము, ''బీజ'' నిర్ణయము జరుగుతుంది. ఇన్నీ సమన్వయ నిర్ణయమునకు దైవానుగ్రహ పర్యవేక్షణ వుంటుంది.
           5 . అయితే, ''యాదృచ్చికములు '' విషయం, ఎలా  జరుగుతూ వున్నాయి అని ప్రశ్న వుంది. అంటే ప్రేమలు, సద్యః సంభోగాలు విషయం. కానీ, అవి కూడా ''యాదృచ్చికములు'' అనడానికి వీలు లేదు. అన్నిటికీ, కార్య కారణాలు ముందే నిర్ణయింపబడి ఆలాంటి కలయికలు జరుగుతూ వుంటాయి అని అనుభవజ్ఞుల వాక్కులు. ''ఈనాటి ఈ బంధమేనాటిదో'' అని, ''ఏ జన్మ కర్మఫలితమో'' అని అంటూ వుంటారు.
          ఈ ''స్త్రీ, పురుషుల'' సంబంధాలను గురించి సమన్వయము కుదురుతుందా, కుదరదా అని 'పొంతనాలు, కుల, గోత్రాలు, వగైరాలు, చూస్తారు. వారికి పుట్టబోయే శిశువు విషయమే కాదు, పెళ్లి తర్వాత, వారి అన్యోన్యానురాగాల  విషయము, ఆయుర్దాయాల, విషయము చూస్తారు.
          పురుషుని వీర్యం          -  బీజము
          స్త్రీ గర్భము                   -  క్షేత్రము
          పురుషుని వీర్యమందు, అలాగే స్త్రీ క్షేత్రమందు వారి వారి గుణములు, రూపురేఖలు, అంగసౌష్టవము, ఆరోగ్యము ఇత్యాదులు అమరివుంటాయి. వారిరువురి ముక్తఫలంగా పుట్టబోయే శిశువులో ఇవి అన్నీ సంగమించి సమ్మిళితమై అవేరూపును దిద్దుకుంటాయి. అందుకే ''సర్వేభ్యః అంగేభ్యఃతేజస్సంభూతోహి:'' అన్నది శాస్త్రం. 
          ''తేజమును'' ఐతరేయోపనిషత్తు రెండర్థాలు. విశేషాలు. చాల వర్ణించింది. కానీ, అన్నిటి సూక్ష్మంశముల సంకలన ప్రకాశం అని తెలుసుకుంటే చాలు.
          ఎందుకంటే, పురుషుని 'బీజం' వల్లనే సంపూర్ణత ఏర్పడదు. తల్లి 'స్త్రీ' గర్భంలోనే ఆ 'బీజం' పెరగాలి. ఆమె తన యొక్క మజ్జ, మేధ, అస్థి, రక్త, మాంసాదులను   తగుపాళ్ళలో చేర్చి పెంచడమే కాదు, ఈ స్థూలములతో కూడా ఆమె, గుణగణములు, ఆలోచన, అలవాట్లు, భావాలూ అనబడే 'సూక్ష్మాలు' కూడా తల్లి గర్భంలోనే పిండాకృతి ఏర్పడుతూ వుంటే, అందులో ఏకమవుతూ వుంటాయి. 
          ఆ దంపతుల పుణ్యమును, అదృష్టమును, తన పుణ్యము, అదృష్టముతో, జతపరచుకుని పుడుతుంది శిశువు.
దైవానుగ్రహం -చైతన్య ప్రవేశం 
          6 . తల్లి గర్భంలోనే పిండం పెరుగుతూ వుంటుంది. నెలలు గడుస్తూ వుంటాయి. 6 వ నెల, దైవానుగ్రహమైన 'చైతన్యం', 'ప్రాణం' తల్లి గర్భంలోని పిండంలోనికి ప్రవేశిస్తుంది. అంటే, 'పిండం' ఊపిరి పోసుకుంటుంది అంటారు. గర్భంలో 'పిండం' చైతన్యవంతమై కదులుతుంది. ఆ కదలిక తల్లికి తెలుస్తుంది. ఆ కదలిక, ఆ 'మధురానుభూతి' తల్లులకే ఎరుక. (పిల్లలు లేని గొడ్రాలుకు, పురుషులకు తెలియదు.) ఇది దైవమాయ. దివ్యచైతన్యము యొక్క 'అంశ' పిండములో ప్రవేశము. పవిత్రము. త్రయీ సంగమసమయం.
          ఇది వైద్య శాస్త్రానికి, జ్యోతిశ్శాస్త్రానికి సుపరిచతము.
         పురానేతిహాసాలలో పేర్కొన్నారు. మార్కండేయ పురాణము చక్కగా వివరించి వుంది. 
ప్రకృతి వైచిత్ర్యం - ప్రేమ తత్వం 
          ప్రకృతిలో గమనించగలిగినవారికి  అన్నీ దైవలీలలే. చిత్రవిచిత్రాలే. ప్రేమతత్వం అతి ముఖ్యం. అవశ్యం.
          సాధారణంగా మానవ శరీరంలోని ఏ అంగంలోనికైన ఏదైనా ఒక ఇతర వస్తువు ప్రవేశిస్తే, వెంటనే దానిని 'బహిర్గతం' చేసేవరకూ  ఆ అంగం విశ్రమించదు. బాధపెడుతుంది. ఉదాహరణకు, ''కంటిలో నలుసు, కాలిలో ముల్లు'' తీసుకోవచ్చు.
          కానీ, స్త్రీ, గర్భంలోనికి  ప్రవేశించిన పురుష 'బీజాన్ని' గర్భం తిరస్కరించదు. "స్వీకరిస్తుంది''. కలుపుకుంటుంది. దీనినే 'ధరిస్తుంది. భరిస్తుంది.' అని వర్ణిస్తారు.తొమ్మిది నెలలు పైగా ధరించి, పోషిస్తుంది. తొమ్మిది నెలలూ తనలోని ప్రతి అణువులోని అంశాన్ని త్యాగం చేసి ఆనందంగా పోషిస్తుంది. ప్రసవించు సమయం ఆసన్నమయే వరకూ  ఆనందంగా ఆలోచనలు, ఊహలతో ఊగిపోతూ వుంటుంది. ప్రసవవేదన వారికే ఎరుక. ఇంక జన్మ జన్మకూ ఈ బాధ వద్దు, భరించలేనని వైరాగ్యభావం కూడా పొందుతారు. కానీ, ఈ బాధ ''తియ్యని'' బాధ అని అన్నారు చలం కవి గారు. ఆ ఆవేదనలోని ''తియ్యందనము'' ఆ తల్లి ప్రసవమవుతూనే అనుభవిస్తుంది.  ఆనందిస్తుంది ఆ తల్లి హృదయం.
ప్రేమ తత్వం 
          ప్రేమ, అంటే ఏమిటో, అవ్యక్తం.
          అనుభూతమయితే గానీ తెలియదు.
          అనుభూతం కావడానికి ఎవరిలోనైన 'ప్రేమ' కలిగింది' అంటే ఎవరిపైనా, దేనిపైన, అనే విషయం, ప్రక్కనే వుంటుంది. 
          అంటే, ప్రేమ అనేది అవ్యక్తమే కానీ, అది క్రియానురాగరూపంగా ఎవరిలోనైన ప్రతీతమయినప్పుడు వారిలో అది అనుభూతమవుతుంది.
         అంటే, ప్రేమ క్రియారూపం ధరించడానికి అంటే ప్రేమించడానికి ఒక వ్యక్తి లేదా వస్తువు వుండాలి.
          ఏదో వస్తువు, ఎవరో వ్యక్తి ప్రక్కనే వుంటే కూడా వానిపైనా ప్రేమ పుట్టదు. కానీ, ఆ వ్యక్తి, ఆ వస్తువు, ''తనది'', ''మనది''  అనే భావం వున్నప్పుడు వానిపైన ప్రేమ పుడుతుంది.
ప్రేమలు - తల్లిదండ్రులు 
         1 . మాతృ గర్భంలో పెరుగుతూ వున్న పిండము తానే, తనాడే అనే భావం ఏర్పరచుకోవడం వల్ల ఆ శిశువు యొక్క యోగ క్షేమములను కోరుకోవడం, తపించడం, శ్రమించడం జరుగుతుంది.
          2 . రెండవది. తన పుత్రుడు తనను ఉద్ధరించువాడు అనే భావంతో పెంచడం. ఇది ''అపుత్రస్య గతిర్నాస్తి'' అనే శాస్త్ర వచనము అంతరంగ ప్రభోధం కావచ్చు. 
          3 . మూడవది, తన పుత్రుడు తనను వృద్ధాప్యంలో పోషిస్తాడు. కడతేరుస్తాడు అని అనుకోవడం. ఇది ఆశ అవుతుంది. ''తనను ముసలితనంలో పోషిస్తాడు'' అనుకోవడంలో 'ఆశ' వుంది. ఇది అవ్యాజ్యము కాదు. పైగా ఆశలను నమ్ముకోవడం దు:ఖ కారణం కావచ్చు.
          సర్వమునకు కర్త, భర్త అయిన ఆ పరమాత్మ జగత్ప్రభువును జగన్మాతలు మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా నమ్ముకొనడం మంచిది. అట్టివాని ''యోగక్షేమం వహామ్యహం'' అని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు గడ శ్రీ కృష్ణ పరమాత్మ. 
          అయినా, అవిద్య, అజ్ఞానము,మనస్సును  కప్పి, భ్రమను భ్రాంతిని పుట్టించి, మమకారంలో, మోహంలో ముంచి ''నా బిడ్డ, నా బిడ్డ, నాది'' అనే భావం నిగూడంగా  ఏర్పడుతుంది. అదే ఆశలే, భావాలే దు:ఖానికి కారణాలు. 
          కానీ, ఈ విధంగా భర్తకు భార్య ప్రియము, 
                                  భార్యకు భర్త ప్రియము,
                                  తండ్రికి తనయుడు ప్రియము,
                                  అందరికీ విత్తము ప్రియము,
          ప్రియము ఏర్పడకపోతే, ప్రియము లేదు, ప్రేమ లేదు, అసలు ప్రపంచమే వుండదు. నడువదు.ఎవరికి ఎవరు? అంటే ఏమీ లేదు. ఆ తత్త్వమే వేరు.
          ఈ వేరు వేరు  తత్త్వాలు ఈనాడు, దేశ, విదేశ, సంస్కారాల సంపర్కాల వల్ల మన ఆచారాలు , వాటి అంతరంగ తత్త్వాలు మరుగున పడిపోతున్నాయి. మచ్చుకు ఒక విషయం బిడ్డకు పాలిచ్చే తల్లులు తక్కువైపోయారు. ఆ బిడ్డలకు 'అయాలే' తల్లులు. నిజమైన కన్నతల్లి ఎవరు అనే సమస్యలు అక్కడక్కడ ఉత్పన్నమవుతాయి. కనీ, తల్లికి మాత్రం తనలో తన బిడ్డపైన ప్రేమ వుండదు అని చెప్పలేము. అది లేకపోతే అది మాతృత్వం కాదు. మానవత్వం కాదు.
ఉత్కృష్టమైనది తల్లి ప్రేమ
          ఈ అవ్యాజ్య ప్రేమకు తల్లికి బిడ్డపైన వుండే ప్రేమయే ఉత్కృష్టమైన ప్రేమ. బిడ్డ పుట్టకముందు, పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు తమ ''స్వస్వరూపము'' లను తమ బిడ్డలో చూసుకొని మురిసి అపురూపమైన ప్రేమ ఏర్పడుతుంది. ఆ ప్రేమకు స్వార్థం తెలియదు. ఎంతైనా త్యాగానికి సిద్ధము. ఆ శిశువును  చీమ కరచినా, దోమ కుట్టిన, చెప్పలేనంత బాధను తాము అనుభవిస్తారు. అది కడుపులోనుండి,  ప్రేగులలోనుండి, హృదయంలో నుండి, ఉబికి వచ్చేటటువంటి ఉత్కృష్టమైన ప్రేమ.
           అంటే, ఒకరికి, ఒక వస్తువు పైన, ఒక వ్యక్తి పైన. . . . .
                    అభిమానము అనురాగము, ప్రియము, ప్రేమ, పుట్టినది అంటే,             ఆ వస్తువు, ఆ వ్యక్తి  ''తన, మన'' అనే భావన  తరంగాలు అతనిలో ఏర్పడినాయి అని.
          ఈ తరంగాల దైర్ఘ్యము, సాంద్రత వారి మధ్య వున్న అనుబంధ సంబంధాలను బట్టి వుంటుంది. వివరంగా. . . 
          బృహదారణ్యకం, మంత్రం - 4 (బ్రాహ్మణం -4) లో గమనించండి.
          ఆత్మ వస్తు కామయ - 'సతి' ప్రియోభవతి తత్వతః  
          ఆత్మ వస్తు కామయ - 'జాయా' ప్రియోభవతి తత్వతః
          ఆత్మ వస్తు కామయ - 'పుత్రాః' ప్రియోభవతి తత్వతః
          ఆత్మ వస్తు కామయ - 'విత్తం' ప్రియోభవతి తత్వతః
          ఆత్మ వస్తు కామయ - 'దేవాః' ప్రియోభవతి తత్వతః అన్నారు.
          ఈ మంత్రంలో, ప్రేమను వర్ణించారా,  ప్రియమును వివరించారా అని సమస్య. ప్రియమే ప్రేమ. ప్రియంగా లేకపోతే ప్రేమ వుండదు అనే విధంగా వున్నవి.
          కానీ,  'ప్రియం' లో 'ఇష్టం' వున్నది. ఇష్టమైనదే  'ప్రియ'మవుతుండి. 'ఇష్టం' లో కోరిక అంతర్లీనముగా వుండి, ఉత్పన్నమవుతుంది. పుత్రుడు 'ఆత్మ వస్తువు' కనుక '' ఆత్మ వస్తు కామాయ'' పుత్రాః, ''ప్రియో భవతి'' అని మంత్రం. అంటే ఇక్కడ కామమునకు సాధారణమైన లౌకికమైన అర్థం ఏమంటే. . .
తల్లి ప్రేమ ప్రేమ- దివ్య
తల్లి ప్రేమ 
          ప్రపంచంలో, ప్రకృతిలోని ఏ ప్రాణికైనా మూలమైనది (ప్రాణదాత) జన్మదాత. . . లౌకికంగా తల్లి.
          తల్లి కన్నప్పటి నుండి కంటికి రెప్పలాగా, తన ప్రాణానికన్నా మిన్నగా భావించి, బిడ్డను రక్షిస్తూ వస్తుంది. బిడ్డకు స్తన్యమిచ్చి, ముడ్డి కడిగి, మూతి కడిగి, ముద్దాడి, తన్నులు తిని, తన ఒడిలో లాలించి, తను తినకపోయినా, తినిపించి, తృప్తి పడే ప్రాణి తల్లి. అంటే, అంత స్వార్థ రహితమైనది, త్యాగమయమైనది తల్లి ప్రేమ.
            తల్లి ప్రేమ ప్రేమమయం, త్యాగమయము, అవ్యాజ్యమయమైనది ,ఉత్క్రుస్తామైనది. అందుకే '' తల్లిని మించిన దైవం, ధారుణి లేదు'' అని అన్నారు. ఈ ప్రేమ తత్వము దైవలీల. ప్రేమలేకపోతే, ఎవరికెవరు లేరు, ఏమీ లేదు. ప్రపంచ నాటకమే వుండదు.
దివ్య ప్రేమ
                  ప్రపంచంలోని  అతి సామాన్య, మానవ మాతృ మూర్తి అయినతల్లికే తన బిడ్డపైన యింత ప్రేమ వుంటే, ప్రపంచంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం చైతన్యం కలుగజేస్తూ సర్వస్వానికి తల్లి అయి, తల్లులకు తల్లి అయి, జగన్మాత అయి అందరూ తన బిడ్డలుగా, అందరి బిడ్డలూ తన బిడ్డలుగా, తన అంశగా భావించి సృష్టి కార్యం జరిపిస్తున్న ఆ పరదేవత పరమాత్మ, జగన్మాతకు తన సంతతి పైన ఎంతటి ప్రేమ వుంటుందో వర్ణించగలమా? ఊహించగలమా? 
              అయితే లోకంలో ఈనాడు ఈ ప్రేమతత్వము వెఱ్ఱితలలు వేసి, అలజడులకు, అరాచకాలకు, ఆందోళనలకు కారణమవుతూ వుంది. ప్రేమలో, ప్రియమైన వస్తువులో లేదా తనకు కావలసినదేదో అంతరంగంలో కోరిక మెదలుతూ ప్రియంగా భాసిస్తూ వుంటుంది.
           ఈ కోరిక వల్లనే ఉపనిషత్ మంత్రంలో రెండు విషయాలు ప్రస్ఫుటంగా నొక్కి చెప్పబడింది. 
           మొదటిది, '' అత్మవస్తు'', ''కామయ '', 
           రెండవది, '' ప్రియో భవతి ''
.  .                ప్రియోభవతి అంటే ప్రేమ కలగడానికి అక్కడ మొదట కోరిక, కామం లోపల మెదలాలి. అయితే ఆ కామం '' ఆత్మ వస్తువు ''పైన వుండాలి. ఇతరముల పైన, ఇతర వస్తువుల పైన కాదు అని గట్టిగ, మళ్ళీ మళ్ళీ మంత్రంలో చెప్పబడింది. అంటే ప్రేమ, మొదట తల్లిపైన, తండ్రిపైన, గురువులపైన, తోబుట్టువులపైన, తన వస్తువులపైన, వుండటం  మంచిది.
 ఇతరులపై, ఇతరుల వస్తువులపైన ''నాది''  అను కోరిక, కామం మంచిది కాదు.
దేవా ప్రియో భవతి - ఆత్మవస్తు కామయ 
         మంత్రంలోని ఆఖరు విషయం, ఎదురీత అని  సామాన్యుల అభిప్రాయం కావచ్చు. కానీ, దైవమె మానవునకు అత్మవస్తువు మానవునకు నిమిత్త ఉపాదాన కారణము.



         



     








                                                        ..........ఇంకా వుంది