WRITER OF SATHYAANVESHANA

SRI SIDDANI MOGILISWAR F/O S. TIRUNAYANA KUMAR, THE BLOGGER WROTE THIS SATHYAANVESHANA IN 2006 AT THE AGE OF 83. IF ANY READER WANTS TO TALK WITH HIM, VISIT HIM AT BLOGGERS HOUSE

చతుర్ధ పుష్పం - నీతి

చతుర్ధ పుష్పం - నీతి 
          ఇంతవరకూ, మూడు పుష్పాలలో గమనింపబడిన బడిన విషయాలు. 
మొదటి పుష్పం - ఆస్థి --- తత్
          తత్ అంటే అది, పర, అజము, అవినాశి, అవ్యక్తము, అణోరణీయాన్, అనంతము, మహతో మహీయన్ అని.
          అది పరంధామములో నిత్యము, సత్యము, శాశ్వతముగా వున్నటు వంటి మూలకందము అన్నారు. 
రెండవ పుష్పము -భాతి --- త్వం 
          త్వం అంటే నీవు, ఇది, అపర, సత్ + అసత్ ల సంకీర్ణము, ద్వంద సంకలనము, పరిణామగతి గలది.
           ఆ  పరంధామములోని 'తత్' మూల కందము నుండి భాసమానమవుతున్నది.
          ఇది నామ, రూప, క్రియా, విశేషణములు గలిగి వున్నది. పరిణామగతి గలిగి వున్నది.
          నిరంతరమూ, 'సృష్టి' కార్యము గలిగి విస్తరిస్తూ వున్నది. 
          ఇది అపర, ప్రకృతి, ప్రపంచము, విశ్వము.
          ఇందులోనే లోకములు, లోకేశులు అయిన సూర్య,సోమాది గ్రహములు, నక్షత్రములు, పంచభూతములు, వృక్ష, లతాది ఓషధులు, లోహది ఖనిజములు, జీవములు గలిగి వున్నది. 84 లక్షల జీవరాసులు గలది. భాసమై అపర అని ప్రత్యక్ష మానమైన ఈ విశ్వంలో మానవుడు విశిష్టుడు.
మూడవ పుష్పము  -  రీతి 
          విశ్వంలోని మానవుడు విశ్వంను  వీక్షించాడు.
          ఆలోచనలో పడ్డాడు. 
        " క్రియా, కరణ కార్యమై సర్వశక్తి సంపన్నమై ద్వంద్వ సంకులమై వున్న ప్రకృతిలోని జడమును చైతన్యపరుస్తూ విశ్వమును విస్తరింపచేస్తూ, విశిష్ట మానవుని సైతం నడిపిస్తూ అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ శక్తి ఏది? " అని ఆలోచనలో పడ్డాడు.
          ఆ శక్తి ప్రకృతిలోనే వున్నదని అవగాహనకొచ్చాడు. 
          మానవుణ్ణి తన వశవర్తునిగా చేసుకొని నడిపిస్తున్న ఆ శక్తిని, 
          తాను  (మానవుడు) వశపరచుకొనడానికి ఆలోచించాడు.
          యత్నించాడు, ప్రయత్నించాడు.
          తపించాడు, తపసించాడు. 
          యజ్ఞాలు, యాగాలు, మంత్రాలూ, తంత్రాలు, జపాలు, తపాలు, అన్ని సాధనాలూ చేస్తూ వచ్చాడు. 
          కొంత పురోగమించాడు.
         పుర్రె కొక బుద్ధి. ఎవరికి తోచిన విధంగా వారు సాధనలు చేస్తూ, సిద్దంతాలు చేస్తూ వచ్చారు.
          ఈ సిద్దంతాలు వేదవాక్కులు కావు.
          ఎందరో మహానుభావులు, వారి పురోగమన మార్గాలు. గమన తీరుతెన్నులలో ఎన్నో వైవిధ్యాలు, తీరుల రీతులు ఏర్పడ్డాయి. 
          ఆ రీతులు ఈ పుష్పంలో (మూడవ పుష్పము) కొన్ని, కొంత చర్చింపబడిన విషయాలు. అందుకే దీనిని రీతి అన్నాము.
నాల్గవ పుష్పము - నీతి 
          మానవుడు సంఘజీవి. 
          మానవుడు ఇతః పూర్వము ఎన్నోవిధాలుగా జప, తప, యజ్ఞ, యాగాదుల ద్వార కొన్ని సిద్ధులను సాధించిన, అవి తనకు సుఖ శాంతులను, శాశ్వతమైన ఆనందాన్ని అందించలేదు. 
          ఎక్కడో కొందరు మహర్షులు, సిద్దులతో తృప్తి పడక,










                                      ........................ఇంకా వుంది